తీపి తినకుండా ఉండేదెలా?
నా వయసు 25. తీపి పదార్థాలు చూస్తే తినకుండా ఉండలేను. అర్ధరాత్రి ఆకలేసినా ఏదో ఒక స్వీటు తినాల్సిందే. ఈ అలవాటు అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసినా నియంత్రించుకోలేకపోతున్నా.
నా వయసు 25. తీపి పదార్థాలు చూస్తే తినకుండా ఉండలేను. అర్ధరాత్రి ఆకలేసినా ఏదో ఒక స్వీటు తినాల్సిందే. ఈ అలవాటు అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసినా నియంత్రించుకోలేకపోతున్నా. ఈ అలవాటు మానేదెలా?
రజిత, హైదరాబాద్
ఆహారానికి ఆకలిని సంతృప్తిపరిచే గుణం ఉంటుంది. దీన్ని ఆస్వాదిస్తూ, ఒత్తిడినీ తగ్గించుకుంటున్నామనే భావనా కలుగుతుంది. అందుకే, ఆకలితో సంబంధం లేకుండా నచ్చింది తిని సంతోషపడిపోతుంటారు చాలామంది. ఇక, మీ విషయానికి వస్తే మీరు తీపి పదార్థాలను తినకుండా ఉండలేకపోవడాన్ని సమస్య అనే కంటే, ఓ అలవాటుగా చెప్పొచ్చు. కొంతమంది చికెన్‌ని ఇష్టపడితే, మరికొందరు ఐస్‌క్రీమ్‌లు, ఇంకొందరు చాక్లెట్లూ... వంటివి అతిగా తింటూ ఉంటారు. రుచి, సువాసన, టెక్స్చర్స్, టెంపరేచర్, క్రంచీ...లను సెన్సోరియల్ ఆట్రిబ్యూట్స్ అంటాం. వీటిని జ్ఞానేంద్రియాలు గ్రహించడం వల్ల తినాలనే కోరిక కలుగుతుంది. అలా మీరు స్వీట్లు తినడాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో టీ, కాఫీ, మద్యపానంలాంటి వ్యసనంగానూ మారే అవకాశమూ ఉంది. ఇక, జీవనశైలి యాంత్రికంగా మారడంతో అందరిలోనూ ఒత్తిడి సహజమైపోయింది. దీని ఉపశమనానికి సంగీతం వినడమో, ఆరుబయట నడకకు వెళ్లడమో ఒకప్పుడు చేసేవారు. ఇప్పుడా పరిస్థితులూ లేవు. దీంతో మనసు మళ్లించుకోవడానికి నోట్లో ఒక టాఫీ వేసుకోవడమో, స్వీటో, ఐస్‌క్రీమో ఆరగించేస్తున్నారు. అందుకే, దానివల్ల ఎదురయ్యే అనారోగ్య ముప్పుని గ్రహించి ఇంటికి స్వీట్లు తెచ్చిపెట్టుకోవడం ఆపేయండి. ఒకవేళ ఉన్నా.. ఎదురుగా కనిపించకుండా చూసుకోండి. తీపి రుచి చూడటమే ముఖ్యం అనుకుంటే స్వీటుని చిన్న ముక్కలా చేసి తిన్నా చాలు. అలానే అధిక కెలొరీలు ఉన్న పదార్థాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోండి. ఉదాహరణకు మోతీచూర్ లడ్డూ, గులాబ్‌జామ్ లాంటి ఎక్కువ పాకం ఉన్నవి కాకుండా రసమలై, బొరుగుల ఉండ, రాజ్‌గిరా చిక్కీ వంటివి తీసుకోండి. రాగి, నువ్వుల లడ్డూలు, తక్కువ తీపితో చేసే ప్లెయిన్ కస్టర్డ్, జెల్లీలాంటివీ సిద్ధం చేసుకుని ఉంచుకోవచ్చు. పండ్లముక్కలు కోసి ఉంచుకుంటే...తినాలనిపించినప్పుడు మీ తీపి ఆలోచనల్ని పక్కనపెడతాయి. తక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్‌ని కూడా తీసుకోవచ్చు. ఈ అలవాట్లతో మీరు ఎక్కువగా స్వీట్లు తినడం తగ్గించుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం జిడ్డుగా ఉంటే..!
- పసిడికి పూసల హంగు!
- జుట్టు సంరక్షణ కోసం..!
- చర్మానికీ ఉపవాసం.. ఎందుకో తెలుసా?
- క్రీములకో స్పూను!
ఆరోగ్యమస్తు
- మయొనైజ్కు బదులు.. ఇవి!
- పనీర్ పెప్పర్.. రుచికే కాదు.. ఆరోగ్యానికీ!
- స్క్రీన్టైమ్ పెరిగితే... రుతుచక్రం ముందుకు!
- మెంతులతో లాభమెంతో!
- అబార్షన్.. సొంత వైద్యం వద్దు!
అనుబంధం
- మరి నాన్న సిద్ధమేనా?
- ఓడిపోనివ్వండి...
- శృంగారం తర్వాత.. ఈ సమస్యలు కనిపిస్తే..
- పిల్లల కోసం నేర్చుకోవాల్సిందే!
- పిల్లల బొమ్మలు మంచివేనా?
యూత్ కార్నర్
- బ్రా గురించి.. అవి అపోహలే!
- గుర్రపు స్వారీలో ప్రపంచ ఛాంపియన్!
- మరణాన్ని జయించి.. విధిని ఎదిరించి!
- సింధు వచ్చాకే... ఆ ధైర్యం!
- ఈ జంట జీవితం... రోడ్లమీదే!
'స్వీట్' హోం
- సకల శుభాలను కలిగించే దీపారాధన!
- మయొనైజ్కి బదులుగా...
- క్యాబేజీకీ... రోలర్!
- ‘ఫుడ్ పాయిజనింగ్’ కాకుండా..!
- మసాలా... స్వచ్ఛమేనా?
వర్క్ & లైఫ్
- వాళ్లలా సంతోషంగా ఉండాలంటే..!
- దువా.. రాహా.. వామికా.. ఈ పేర్లకు అర్థమేంటో తెలుసా?
- ఫోను వదలాలంటే భయం!
- డెస్క్ అందంగా ఉంటే.. పనితనం పెరుగుతుందట!
- ఒక్క గేమ్ ఆడండి!