Hydra: బుల్డోజర్ న్యాయం ఆపండి.. ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్
బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
హైదరాబాద్: బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.
నేరస్థులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్ గుర్తుచేశారు. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తుందని, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్స్ కేసు.. మహిళకు 13ఏళ్ల జైలు శిక్ష వేసిన రంగారెడ్డి కోర్టు
-
తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. సోషల్ మీడియాలో పోస్టు
-
ఎల్ఐసీ లాభంలో క్షీణత.. తొలి ప్రీమియం వసూళ్లు పెరిగినా..!
-
కాంగ్రెస్ నేతలు షో కోసమే అలా చేస్తుంటారు: మోదీ విమర్శలు
-
అవును.. అనారోగ్యంతో బాధపడుతున్నా: శివరాజ్‌కుమార్
-
లాయర్‌ను చంపి.. పోలీసులకు ‘సుపారీ’ ట్విస్ట్ ఇచ్చిన కిల్లర్