BRS: మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు భారాస నేతలు అరెస్టు

సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 12 Sep 2024 19:19 IST

హైదరాబాద్‌: సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీ కార్యాలయం ముందు భారాస నేతలు ఆందోళనకు దిగారు.  దీంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై భారాస నేతలు అభ్యంతరం తెలిపారు. అరెకపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని