logo

హైదరాబాద్ వార్తలు

Short News

చాంద్రాయణగుట్ట, చార్మినార్‌: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రజినీరెడ్డి తెలిపారు. ఇటీవల దవాఖానాను సందర్శించిన చార్మినార్‌ ఎమ్మెల్యే మిర్‌ జుల్ఫీకర్‌ అలీకి.. పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై  విచారణ చేపట్టామని, డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడి కావడంతో నలుగురిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు మంగళవారం వెల్లడించారు. 

ఈనాడు, హైదరాబాద్‌: పాతబస్తీ మెట్రోకి మూడో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ మంగళవారం జారీ అయింది. మొదటి రెండు విడతల్లో 400వరకు ఆస్తులను గుర్తించి ఇదివరకే భూసేకరణ ప్రకటన జారీచేశారు. తాజాగా దారుల్‌షిఫా నుంచి శాలిబండ వరకు సేకరించాల్సిన మరిన్ని ఆస్తుల మదింపు పూర్తికావడంతో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పేరున నోటిఫికేషన్‌ ఇచ్చారు. అభ్యంతరాలకు జనవరి 2వరకు బేగంపేట మెట్రోరైలు కార్యాలయంలోని భూసేకరణ విభాగంలో తెలపవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉండే ఈ మార్గం నిర్మాణానికి రూ.2,741 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.