• English
  • Login / Register

ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన కార్‌ల వివరాలు

బిఎండబ్ల్యూ ఎక్స్1 కోసం rohit ద్వారా ఏప్రిల్ 03, 2023 12:06 pm ప్రచురించబడింది

  • 34 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2023 మొదటి త్రైమాసికంలో ఆటో ఎక్స్ؚపో జరిగినప్పటి నుండి విడుదలైన అన్ని ముఖ్యమైన కార్‌ల వివరాలను ట్రాక్ చేయడం కష్టతరం కాబట్టి వాటి జాబితాను ఇక్కడ అందించాము

Cars launched in first quarter of 2023

దేశవ్యాప్తంగా ఉన్న కారు ప్రియలు మరియు కోనుగోలుదారులకు సరికొత్త కార్‌ల విడుదల, ఆవిష్కరణలతో 2023 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి త్రైమాసికం పూర్తి అయిన తరువాత, లగ్జరీ పర్ఫార్మెన్స్ కార్‌ల నుండి ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ వరకు ఇప్పటివరకు జరిగిన అన్ని ముఖ్యమైన విడుదలలను మళ్ళీ చూద్దాం. 

Q1 2023లో కారు తయారీదారు-వారీ పూర్తి విడుదల జాబితాను ఇప్పుడు చూద్దాం:

మారుతి 

గ్రాండ్ విటారా CNG

ధర రూ.12.85 లక్షల నుండి ప్రారంభం

ఈ సంవత్సరం జనవరిలో, భారతదేశంలో CNG కిట్ ఎంపికను పొందిన మొదటి SUV మారుతి గ్రాండ్ విటారా. మారుతి CNG కిట్ؚను మిడ్-స్పెక్ డెల్టా మరియు జెటా వేరియెంట్ؚలలో అందిస్తుంది. గ్రాండ్ విటారా CNG 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది కానీ 88PS పవర్ మరియు 121.5Nm టార్క్‌ను అందిస్తుంది (ప్రామాణిక వెర్షన్ؚలలో 103PS/137Nm), ఇది కేవలం 5-స్పీడ్‌ మాన్యువల్ؚతో మాత్రమే జత చేయబడింది.

Maruti Grand Vitara and Brezza

బెజ్జా CNG 

రూ.9.14 లక్షల నుండి ప్రారంభం

ఎక్స్ؚపోలో ప్రదర్శించిన తరువాత, మార్చిలో విడుదలైన మారుతి బ్రెజ్జా కూడా ఈ సంవత్సరం CNG ఎంపికను పొందింది. ఇది మూడు వేరియెంట్ؚలలో అందుబాటులో ఉంది – LXi, VXi మరియు ZXi – అంతేకాకుండా, డ్యూయల్-టోన్ షేడ్ؚతో కూడా వస్తుంది (ZXi DT). బ్రెజ్జా CNG 5-స్పీడ్‌ MTతో జత చేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను (88PS/121.5Nm) ఉపయోగిస్తుంది. 

టాటా

నవీకరించబడిన హ్యారియర్/సఫారి

ధర రూ. 23.62 లక్షలు /రూ. 24.46 లక్షల నుండి ప్రారంభం

Updated Tata Harrier
Updated Tata Safari

ఈ కారు తయారీదారు హ్యారీయర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ؚను విడుదల చేసింది, వీటిని 2023 ఆటో ఎక్స్ؚపోలో ఆవిష్కరించారు. లుక్ పరంగా మార్పులతో పాటు, పెద్ద టచ్‌స్క్రీన్ మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ؚతో (ADAS) పాటు కొన్ని కొత్త ఫీచర్‌లను కూడా ఇవి రెండూ పొందాయి. కొత్త జోడింపులు మరియు లుక్ కారణంగా దీని ధర ఒక లక్ష రూపాయల వరకు పెరిగింది, రెండు SUVల పవర్ؚట్రెయిన్ ఇప్పుడు BS6 2.0కి అనుగుణంగా ఉంటుంది. 

Tata Altroz
Tata Nexon

BS6 2.0 నవీకరించబడిన లైన్అప్: అన్నీ టాటా కార్‌లు ఇప్పుడు BS6 2.0కు అనుగుణంగా ఉండే పవర్‌ట్రెయిన్ؚలతో వస్తాయి. టియాగో, ఆల్ట్రోజ్ మరియు పంచ్ వంటి చిన్న మోడల్‌లు ఇప్పుడు మరింత ఇంధన సామర్ధ్యం కూడా కలిగి ఉంటాయి. 

ఇది కూడా చదవండి: టియాగో EV అధికారిక భాగస్వామిగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తున్న 2023 టాటా IPL

హ్యుందాయ్

Updated Hyundai Alcazar

నవీకరించబడిన ఆల్కజార్

ధర రూ. 16,75 లక్షల నుండి ప్రారంభం

హ్యుందాయ్ ఆరవ-జనరేషన్ వెర్నాతో కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను (160PS/253Nm) విడుదల చేయాలనుకుంది, కానీ దానికి బదులుగా ఈ ఇంజన్‌ను ఆల్కజార్ؚతో పరిచయం చేసింది. ఇందులో ఇంతకు ముందు అందించిన 159PS 2-లీటర్ పెట్రోల్ యూనిట్ స్థానంలో ఇది వచ్చింది మరియు రూ.65,000 అధిక ధరతో వస్తుంది. 6-స్పీడ్‌ MTని నిలుపుకున్నప్పటికీ, మునపటి 6-స్పీడ్‌ ఆటోమ్యాటిక్ؚకు బదులుగా కొత్త టర్బో యూనిట్ 7-స్పీడ్‌ DCT ఎంపికతో వస్తుంది. 

Hyundai Grand i10 Nios
Hyundai Aura

నవీకరించబడిన గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరా

ధర రూ. 5.69 లక్షలు మరియు రూ.6.30 లక్షల నుండి ప్రారంభం

జనవరి 2023లో హ్యుందాయ్ నవీకరించబడిన గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరాలను భారతదేశంలో విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్-సెడాన్ జంట లుక్, ఇంటీరియర్‌ల పరంగా  తేలికపాటి మార్పులు పొందింది. కొన్ని కొత్త ఫీచర్‌ల జోడింపుతో (బీఫియర్ సేఫ్టీ కిట్ؚతో సహా) దీని ధర రూ.33,000 పెరిగింది. వీటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కొనసాగించినప్పటికీ (దీన్ని E20 మరియు BS6 2.0కు అనుకూలంగా రూపొందించారు), 1-లీటర్ టర్బో యూనిట్ నిలిపివేయబడింది. 

Hyundai Ioniq 5

అయోనిక్ 5 

ధర రూ.44.95 లక్షల నుండి ప్రారంభం

భారతదేశంలో హ్యుందాయ్ ఫ్లాగ్ؚషిప్ EV అయోనిక్ 5, ఆటో ఎక్స్ؚపోలో ఆవిష్కరించారు. మన మార్కెట్ؚలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన హ్యుందాయ్ కారు ఇది, కేవలం ఒక వేరియెంట్ؚలోనే అందుబాటులో ఉంది. దీని తోటి ఇంపోర్టెడ్ వాహనం కియా EV6 విధంగా కాకుండా-తక్కువ ధరతో అందిచే ఉద్దేశంతో హ్యుందాయ్ EV స్థానికంగా అసెంబుల్ చేయబడింది. 72.6kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇది ARAI-క్లెయిమ్ చేసిన 631km మైలేజ్‌ను అందిస్తుంది.

New Hyundai Verna

ఆరవ-జెన్ వెర్నా 

ధర రూ. 10.90 లక్షల నుండి ప్రారంభం

ఈ సంవత్సరం హ్యుందాయ్ విడుదల చేస్తున్న వాహనాలలో సరికొత్త మరియు అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ కొత్త వెర్నా. ఈ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు భారీగా, ధృఢంగా మరియు ADAS మరియు హీటెడ్ సీట్‌ల వంటి కొత్త ఫీచర్‌లؚతో వస్తుంది. డీజిల్ ఇంజన్ ఎంపికను నిలిపివేసింది, కానీ 160PS 1.5-లీటర్ టర్బో చార్జెడ్ యూనిట్ؚతో సహా రెండు పెట్రోల్ పవర్ ట్రెయిన్ؚలతో అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి: రూ. 15 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టాప్ 10 టర్బో-పెట్రోల్ కార్‌ల వివరాలు

హోండా

New Honda City and City Hybrid

నవీకరించబడిన సిటీ మరియు సిటీ హైబ్రిడ్

ధర రూ.11.49 లక్షల నుండి ప్రారంభం

హోండా తన ఐకానిక్ సెడాన్, సిటీని ఈ మార్చిలో నవీకరించింది. ప్రామాణిక సిటీ మరియు సిటీ హైబ్రిడ్ రెండూ కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియెంట్ؚలతో అందిస్తున్నారు. కొత్త వెర్నా విధంగానే, హోండా సిటీ కూడా డీజిల్ పవర్‌ను కోల్పోయింది కానీ వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ADAS వంటి ఫీచర్‌లను కేవలం పెట్రోల్ వేరియెంట్ؚలలో పొందింది. వీటి పవర్‌ట్రెయిన్ మరియు గేర్ బాక్స్ ఎంపికలలో ఎటువంటి మార్పులు చేయలేదు, ఈ విభాగంలో ఒకే ఒక హైబ్రిడ్ ఎంపికగా ఇది కొనసాగుతుంది. 

కియా

Kia Carens

నవీకరించబడిన కేరెన్స్

ధర రూ.10.45 లక్షల నుండి ప్రారంభం

తన ప్రజాదరణ పొందిన మోడల్‌లలో పవర్‌ట్రెయిన్ؚలను నవీకరించాలనే కియా ప్లాన్ గురించి ప్రత్యేకంగా తెలియజేసిన వెంటనే, ఈ కారు తయారీదారు నవీకరించబడిన కేరెన్స్ؚను విడుదల చేసింది. దీని 1.4-లీటర్ టర్బో యూనిట్ ఇంజన్ؚను వెర్నాలో ఉండే 1.5-లీటర్ టర్బో యూనిట్ؚతో మార్చారు. 6-స్పీడ్‌ MT బదులుగా టర్బో ఇంజన్ؚతో iMT గేర్ బాక్స్ؚను కియా తీసుకువచ్చింది. దీని ధర అర లక్ష వరకు పెరిగింది అలాగే ఫీచర్‌ల పరంగా కొన్ని మార్పులు చేసింది. 

MG

Facelifted MG Hector
MG Hector Plus

నవీకరించబడిన హెక్టార్ మరియు హెక్టార్ ప్లస్

ధర రూ.15 లక్షల నుండి ప్రారంభం

ఆటో ఎక్స్‌పో 2023లో MG నవీకరించబడిన హెక్టార్ మరియు హెక్టార్ ప్లస్ SUVలను ఆవిష్కరించింది. ఈ నవీకరణతో, ఈ SUV జంట కొన్ని కొత్త వేరియెంట్‌లను, ఖరీదైన లుక్ మరియు ADASతో సహా మరిన్ని ఫీచర్‌లను కూడా పొందింది. MG ఇప్పటికీ ఈ రెండు SUVలను 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚలతో అందిస్తుంది, మొదటిది CVT గేర్ బాక్స్ ఎంపికను పొందింది. 

మహీంద్రా

Mahindra Thar RWD

థార్ RWD 

రూ.9.99 లక్షల నుండి ప్రారంభం

ఈ సంవత్సరం జనవరిలో, మహీంద్రా, మరింత చవకైన థార్ వేరియెంట్ؚలను పరిచయం చేసింది. దీని 4WD సిస్టమ్ؚను రేర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్‌తో(RWD) మార్చింది. మూడు వేరియెంట్ؚలలో హార్డ్ టాప్‌తో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ థార్ؚలో చెప్పుకోవలసినది మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 118PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రమే. కేవలం ఆటోమ్యాటిక్ؚతో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను పొందింది. 

టయోటా 

2023 Toyota Innova Crysta

నవీకరించబడిన ఇన్నోవా క్రిస్టా 

ధర రూ.19.13 లక్షల నుండి ప్రారంభం

మూడవ-జనరేషన్ ఇన్నోవా అమ్మకాలు మొదలైనప్పటి నుండి (ఇన్నోవా హైక్రాస్ గా పిలిచే), ఇన్నోవా క్రిస్టా తిరిగి వస్తుందని ఆశించాము. ఇది మార్చిలో మార్కెట్ؚలోకి ప్రవేశించింది, హైక్రాస్ పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే దీని ధర రూ.59,000 ఎక్కువగా ఉంది. ఇన్నోవా క్రిస్టా తన 150PS 2.4-లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్ؚను కొనసాగించింది, ఇది ఇప్పుడు E20 మరియు BS6 2.0కు అనుకూలంగా ఉంటుంది.

Toyota Hyryder CNG

హైరైడర్ CNG 

ధర రూ.13.23 లక్షల నుండి ప్రారంభం

దీని తోటి మారుతి వాహనం గ్రాండ్ విటారాలాగే, టయోటా కాంపాక్ట్ SUV హైరైడర్ కూడా ఈ సంవత్సరం CNG కిట్ ఎంపికను పొందింది. ఈ CNG వేరియెంట్ ధర సాధారణ వేరియెంట్ؚలతో పోలిస్తే రూ.95,000 అధికంగా ఉంటుంది మరియు మారుతి SUVలో ఉండే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతోనే వస్తుంది.

Toyota Land Cruiser 300

కొత్త ల్యాండ్ క్రూయిజర్ (LC300)

ధర రూ.2.10 కోట్లు 

ఆటో ఎక్స్‌పో 2023లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ؚను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది, ఆవిష్కరణ తరువాత వెంటనే ధరలను వెల్లడించింది. ఈ ఫ్లాగ్ؚషిప్ SUV కేవలం ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ؚతో జోడించబడి డీజిల్ ఇంజన్ؚతో (3.3-లీటర్ ట్విన్-టర్బో V6) మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఇది కూడా చదవండి: సున్నా నుండి ఆరు వరకు: భారతదేశ కార్‌లలో ఎయిర్ బ్యాగ్ؚలు తప్పకుండా ఉండవలసినవిగా ఎలా అయ్యాయి

విడుదల అయిన ఎలక్ట్రిక్ కార్‌లు

Citroen eC3

సిట్రియోన్ eC3 

ధర రూ.11.50 లక్షల నుండి ప్రారంభం

ఈ ఫ్రెంచ్ తయారీదారు భారతదేశంలో విడుదల చేసిన మూడవ వాహనం పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన C3 హ్యాచ్‌బ్యాక్. ఇందులో 29.2kWh బ్యాటరీ ప్యాక్ (ARAI క్లెయిమ్ చేసిన 320km పరిధి) ఉంటుంది, ICE వెర్షన్ؚలాగే దీనిలో కూడా ఫీచర్‌లు లేవు.  

Mahindra XUV400

మహీంద్రా XUV400 

ధర రూ.15.99 లక్షల నుండి ప్రారంభం

XUV400 ప్రధానంగా ఎలక్ట్రిఫైడ్ XUV300 కానీ పొడవైన ఫుట్ ప్రింట్ؚను కలిగి ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది: 34.5kWh (375km) మరియు 39.4kWh (456km). XUV300లో కంటే ఎక్కువగా ఎటువంటి ఫీచర్ లేదా ఇంటీరియర్ నవీకరణలను ఇది పొందలేదు. 

విడుదల అయిన లగ్జరీ కార్‌లు

New BMW X1
New Audi Q3 Sportback

భారతదేశంలో లగ్జరీ కార్ మార్కెట్, 2023 మొదటి మూడు నెలలో విస్తరించింది, ఇప్పటికే సుమారుగా ఏడు కొత్త ఆవిష్కరణలు జరిగాయి. వీటిలో మెర్సిడెస్-AMG E53 కాబ్రియోలెట్, కొత్త ఆడి Q3 స్పోర్ట్ బ్యాక్, కొన్ని BMW మోడల్‌లు: మూడవ జనరేషన్ BMW X1, i7 మరియు ఏడవ-జనరేషన్ 7 సీరీస్ మరియు నవీకరించిన 3 సీరీస్ గ్రాండ్ లిమోసిన్ మరియు X7 ఉన్నాయి. 

ఇక్కడ మరింత చదవండి: BMW X1 ఆటోమ్యాటిక్

was this article helpful ?

Write your Comment on BMW ఎక్స్1

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience