ఇ–కమిటి గురించి
భారతదేశములో న్యాయ వ్యవస్థ అవలంభించిన సమాచార సాంకేతిక వ్యవస్థ్య యొక్క కార్యక్రమాలను ప్రదర్శించే ఈ పోర్టల్ కు ఇ-కమిటీ,భారత సర్వోన్నత న్యాయస్థానము మిమ్మల్ని స్వాగతిస్తొంది. ఇ-కమిటీ అనేది “భారతీయ న్యాయ వ్యవస్థ(ఇండియన్ జ్యుడీషియరీ) ప్రణాళిక” క్రింద సంభావితీకరించబడిన ఇ-న్యాయస్థానముల ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతాయుతమైన పాలకమండలి. ఇ-న్యాయస్థానములు(ఇ-కోర్ట్స్) అనేది పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఈ పధకమును భారత ప్రభుత్వం న్యాయ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖల ద్వారా పర్యవేక్షిస్తుంది మరియు నిధులు సమకూరుస్తుంది. న్యాయస్థానములలో సమాచార సాంకేతిక వ్యవస్థ్యతో దేశ న్యాయ వ్యవస్థను మార్చడం దీని లక్ష్యము.
పథకము (ప్రాజెక్ట్) యొక్క అవలోకనం
- సమర్థవంతమైన కేంద్రీకృత పౌర సేవలను ఇ-న్యాయస్థానముల(ఇ-కోర్ట్స్) పధకము (ప్రాజెక్ట్) ద్వారా కక్షిదారులకు సేవలను అందించడం.
- న్యాయస్థానాలలో సమర్థవంతమైన న్యాయపంపిణీ వ్యవస్థలను స్థాపించడం, అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం.
- కక్షిదారులకు సమాచారం యొక్క వివరములను తెలియజెసే ప్రక్రియలను సులభతరం చేయడం.
- వ్యవస్థలో కేసుల పరిష్కారం గుణాత్మకంగా మరియు పరిణామాత్మకంగా పెంచడం, న్యాయపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, తక్కువ ఖర్చుతో నమ్మదగినదిగాను మరియు పారదర్శకంగాను చేయడం.